W.G: పాలకొల్లు ఎల్.ఆర్.పీట మెయిన్ రోడ్డులోని ఓ పాడుబడిన గోడౌన్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఏళ్ల తరబడి గోడౌన్ నిరుపయోగంగా ఉండటంతో లోపల పేరుకుపోయిన చెత్తకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.