MBNR: 7వ చిన్న నీటి తరహా నీటి వనరుల గణన పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2023-24 అకాడమిక్ సంవత్సరాన్ని ప్రమాణికంగా తీసుకొని మొబైల్ యాప్ ద్వారా గణన చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక అధికారి రవీందర్ పాల్గొన్నారు.