హీరో విశాల్‌కు మద్రాసు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. గతంలో ఓ ఫైనాన్షియర్ వద్ద విశాల్ తీసుకున్న రూ.21 కోట్ల రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ చెల్లించింది. ఈ సందర్భంగా, భవిష్యత్తులో విశాల్ నిర్మించే సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు తమకే దక్కేలా లైకా ఒప్పందం చేసుకుంది. విశాల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో, అతడు 30% వడ్డీతో కలిపి లైకాకు రూ.21.3 కోట్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.