GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. అర్జీలను ఒక్కొక్కటిగా పరిశీలించిన గల్లా మాధవి వాటిని పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.