ADB: ప్రజలలో పోలీసు కీర్తి ప్రతిష్టలు పెంచేలా విధుల నిర్వహణ చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాహనాలను పరిశీలించి వాటి స్థితిగతులపై విచారించారు. ఎస్పీ మాట్లాడుతూ.. దొంగతనాలు, ఆర్థిక నేరాలు జరగకుండా రాయితీ బియ్యం తరలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.