NDL: జిల్లాలో వరి కోత యంత్రాల వినియోగం పెరగడంతో వ్యవసాయ కూలీల పనులు కరువయ్యాయి. ఒకప్పుడు కోతలు మొదలైతే గ్రామాల్లో సందడి, కూలీలకు ఉపాధి దొరికేది. ధాన్యాన్ని కల్లాల వద్ద ఆరబోసి, తూర్పారబట్టి, బస్తాల్లో నింపడానికి కూలీలు పోటీపడేవారు. కానీ, త్వరగా పని పూర్తి చేసేందుకు రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపడంతో, కూలీలు జీవనోపాధి కోల్పోతున్నారు.