HNK: రోడ్డు ప్రమాదాల నివారణకు శాయంపేట పోలీసులు వినూత్న చర్యకు నాంది పలికారు. పరకాల ఏసీపీ సతీష్ బాబు చొరవతో మంగళవారం కొత్తగట్టు–సింగారం క్రాస్‌రోడ్డు వద్ద రాత్రివేళల్లో కూడా స్పష్టంగా కనిపించే 3D రేడియంట్ స్టిక్కర్లు, బోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. తరచూ ప్రమాదాలు జరిగే ఈ ప్రాంతంలో కొత్త ఏర్పాట్లు వాహనదారులకు దోహదంగా మారాయని వారు హర్షం వ్యక్తం చేశారు.