WGL: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హాసన్పపర్తి మండలాల పరిధిలోని 1,111 స్వయం సహాయక సంఘాలకు రూ.2కోట్ల 6లక్షల 79వేల విలువ గల చెక్కులను MLA మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యశారదదేవి, టీక్యాబ్ ఛైర్మన్ మార్నేనితో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.