ASR: రంపచోడవరం బాలుర గురుకుల పాఠశాలను ITDA PO స్మరణ్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాలయాల్లో ఉంటున్న వారికీ నాణ్యమైన చదువుతో పాటు ఆహారం కూడా అందజేయాలని ఆదేశించారు. వేడి వేడి ఆహారాన్ని ఇవ్వాలన్నారు. వారి ఆరోగ్యం ఎప్పటికప్పుడు గమనించాలని ఆదేశించారు.