KRNL: ఆలూరు నియోజవకర్గంలో ఈసారి TDP గెలవడం ఖాయమని MP నాగరాజు అన్నారు. ఆలూరులో ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు. 30ఏళ్లుగా ఆలూరులో TDPకి విజయం దక్కకపోయినా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో విశ్వాసాన్ని నింపాయని అన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకున్న ప్రభుత్వం అని, ఆలూరులో పసుపు జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.