టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారత్లో ల్యాండ్ అయ్యాడు. ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం లండన్ నుంచి కోహ్లీ ఈ రోజు భారత్కు చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్లో కోహ్లీని చూసిన అభిమానులు అతడి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ‘KING IS BACK’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.