WGL: పట్టణంలోని ఎనుమాముల మార్కెట్లో మొక్కజొన్న ధర గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత దారుణంగా పతనమవుతున్నదని రైతులు వాపోతున్నారు. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర సోమవారం రూ.1,970కి పడిపోయింది. ఇవాళ మరింత తగ్గి రూ.1900కి పతనమైంది రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలాగే, సూక పల్లికాయకు రూ.6వేలు, 5531 రకం మిర్చికి రూ.16,500 ధర ఉందని వారు తెలిపారు.