MHBD: సీరోలు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డాక్టర్ రాంచందర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. DSFI జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్, తదితరులున్నారు.