JGL: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ వద్ద కానిస్టేబుల్ రైటర్‌గా పనిచేస్తున్న అమిరిశెట్టి జలంధర్‌కు మంగళవారం డీఎస్పీ రఘు చందర్ నగదు బహుమతి ఇచ్చి అభినందించారు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి ఉద్యోగరీత్యా ప్రతిభ చూపినందుకుగాను ఈ నగదు బహుమతి అందించి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని సూచించారు.