KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిలకడగానే ఉంది. మంగళవారం యార్డుకు 670 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.6,950, కనిష్ఠంగా రూ.6,300 పలికింది. అలాగే గోనెసంచుల్లో వచ్చిన 16 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,600 ధరకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు.