MDK: గత ప్రభుత్వ హయాంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి ఏడాది సమయం, అంతకన్నా ఎక్కువ సమయం పట్టేదని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని శంకరంపేట లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మొత్తం 41 చెక్కులు లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. ప్రస్తుతం అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు తెలిపారు.