SKLM: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సారవకోట పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం సారవకోట మండలంలో పలు గ్రామాలలో నారీ శక్తి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజీలు, వ్యక్తిగత వివరాలు బ్యాంక్ సమాచారం ఎవరికీ ఇవ్వకూడదని సూచించారు.