AP: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు అయింది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలను ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రధానంగా రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లోని గోదావరి నది తీరాలలో పుష్కరాలు జరగనున్నాయి. సుమారు 8 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లను విడుదల చేసింది.