కృష్ణా: బీపీటీ ధాన్యం కొనట్లేదనే వదంతులు నమ్మవద్దని, నియోజకవర్గంలో ఇప్పటికి 513 మెట్రిక్ టన్నుల బీపీటీ ధాన్యం కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. రావివారిపాలెంలో రైస్ మిల్లు సందర్శించి, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. సాధ్యమైనంత వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లరుకు సూచించారు.