PPM: సమాజంలో స్త్రీ, పురుషులిద్దరూ సమానమేనని, ఆ విషయాన్ని అందరికీ అర్ధమయ్యేలా విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. జెండర్ సమానత్వం కొరకు జాతీయ ప్రచారంలో భాగంగా మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం కలెక్టరేట్లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు.