TG: ప్రభుత్వ నిర్ణయాలను ప్రతిపక్షాలకు లీక్ చేస్తున్న వారిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఎవరు లీక్ చేస్తున్నారో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు, చర్చల సారాంశం మొత్తం గులాబీ లీడర్లకు వెంటనే చేరుతున్నట్లు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.