ADB: నేరడిగొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ తండ్రి గంగయ్య ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ బాధితుడిని మంగళవారం పరామర్శించారు. ఈ మేరకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌ను కోరారు.