ADB: ఉట్నూర్ మండలంలోని కొత్తగూడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదివాసీ పోరాటయోధుడు కొమురంభీం విగ్రహాన్ని బుధవారం(రేపు) ఆవిష్కరించనున్నట్లు మంగళవారం గ్రామ పటేల్ ఆత్రం ఆకృ ప్రకటనలో తెలిపారు. జల్, జంగల్ జమీన్ కోసం కొమురంభీం ఎంతో కృషి చేశారన్నారు. దీనికి ఆదివాసీ పెద్దలు, నాయకులు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలనీ కోరారు.