ADB: రైతుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని, అధైర్య పడొద్దని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జైనథ్ మండల్ కరింజ కె. గ్రామానికి చెందిన రైతులు జోగు రామన్నను మంగళవారం తన నివాసంలో శాలువాతో సత్కరించారు. రైతుల పక్షాన నిలబడి చేపట్టిన నిరసన ఆందోళన కార్యక్రమాలతో వేలి ముద్ర నిబంధన ఎత్తివేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.