MBNR: పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం యూనివర్సిటీలో రూ.75 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతన ఇంజనీరింగ్, లా కళాశాల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత సంవత్సరం ప్రధానమంత్రి ‘ఉష’ పథకం కింద పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు.