NLG: దేవరకొండలోని వైష్ణవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళ సంఘాలకు వడ్డీ లేని ఋణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే బాలునాయక్ పాల్గొని మాట్లాడుతూ.. వ్యాపారాలు చేయడం మగవారికి మాత్రమే సాధ్యమేమోనన్న కాలం పోయిందని, మగువలు సైతం మహాద్భుతాలు సృష్టించే రోజు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.