SKLM: రైతే దేశానికి వెన్నుముక అని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. సారవకోట మండలం లక్ష్మీపురం గ్రామంలో “రైతన్నా… మీ కోసం” కార్యక్రమంలో ఇవాళ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతును రాజును చేయడం కూటమి ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్య కార్యక్రమాలను సంక్షిప్తంగా రైతులకు వివరించారు.