AP: కడప పులివెందులలోని క్యాంప్ ఆఫీస్కు మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. రేపు పలు ప్రైవేట్ కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం పులివెందులలో అరటి పంటలను పరిశీలించనున్నారు. అరటి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. కాగా రాష్టంలో అరటికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.