AP: రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుపై సబ్ కమిటీ ఇచ్చిన నివేదికకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. కొత్తగా మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా అంగీకరించారు.