JN: స్టేషన్ ఘనపూర్ MLA కడియం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మాజీ MLA తాటికొండ రాజయ్య మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో BRS మద్దతుతో గెలిచి పార్టీ మారి, ఇంకా రాజీనామా చేయడం లేదని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.