JN: మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఎంపీ కడియం కావ్య, MLA కడియం శ్రీహరిలు అన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఇవాళ మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాలపై వడ్డీ రాయితీ చెక్కుల పంపిణి కార్యక్రమం జరిగింది. ఎంపీ, MLA, కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేశారు.