NLR: మర్రిపాడు మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో మంగళవారం ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి కవిత రైతులకు పలు సూచనలు జారీ చేశారు. పంట పొలాలకు తగిన మోతాదులోనే ఎరువులు వేయాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి 5 ప్రిన్సిపుల్స్ అంటే నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, మద్దతు ధర వంటి వాటి గురించి రైతులకు వివరించారు.