MLG: జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో మిషన్ భగీరథ పైప్లాన్ లీకేజీతో నీరు వృథాగా పోతోంది. దీంతో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే పైప్లాన్ లీకేజీకి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.