BHNG: గ్రామంలో ఉన్న పిల్లలందరూ అంగన్వాడికి వచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడీ టీచర్‌కు సూచించారు. ఇవాళ భువనగిరి మండలం కూనూరులో అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీలో మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజన శాలను సందర్శించి మోను వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.