PLD: మాచర్ల మండలం కంభంపాడు వద్ద NSP కాలువలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పైదిశ నుంచి కాలువలో కొట్టుకుని వచ్చిన మృతదేహం ముళ్లకంపకు తగిలి ఆగిపోవడంతో అక్కడి రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.