SKLM: రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రమాదాల వలన ప్రజలకు ప్రాణనాష్టం జరగకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నో పార్కింగ్ ప్రాంతాలతో పాటు, టోల్ ప్లాజాల వద్ద రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 5 గంటల వరకు తనిఖీలు నిర్వహిస్తామన్నారు.