TG: HYDలో భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటే టీ ఫైబర్ కేబుళ్లనూ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా స్కూల్కు 20ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్కు 40 ఎకరాలు కేటాయింపునకు అనుమతిచ్చామన్నారు.