JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి వనిత టీ పాయింట్‌ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది అన్నారు. వ్యాపారాలతో ఆర్థికంగా వృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.