KMM: ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారంతో అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాస్ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుని వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, కుడి చేతికి సూర్యుడి టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.