KRNL: ఎమ్మిగనూరు ఎన్జీవో భవనంలో APNGOS అసోసియేషన్ ఎన్నికలు ఎలాంటి పోటీలు లేకుండా ఏకగ్రీవంగా శుక్రవారం ముగిశాయి. మొత్తం 11 పదవులకు 11 నామినేషన్లు రావడంతో ఎన్నికల అధికారి బి. కోదండరామయ్య పర్యవేక్షణలో ఎన్నికలు పూర్తయినట్లు ప్రకటించారు. కొత్త కమిటీకి ప్రమాణ స్వీకారం నిర్వహించి, రాష్ట్ర నాయకత్వం బలపడేలా, ఉద్యోగుల సమస్యలపై చురుకుగా చేపట్టాలని వెల్లడించారు.