WGL: గ్రామాల్లో గుర్తులతో గెలిచిన సర్పంచులు అప్పుల నుంచి గట్టెక్కడం కోసం అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల్లో అప్పులు చేసి గెలిచిన అభ్యర్థులు, అభివృద్ధి పనుల ద్వారానే ఆ భారాన్ని తగ్గించుకోవచ్చన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. గతంలో జరిగిన ఫిరాయింపులు వారికి ప్రేరణగా మారాయి. అధికార పార్టీ ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.