BHPL: డిసెంబర్ ఒకటి నుంచి ఎక్సైజ్ నూతన సంవత్సరానికి పంచాయతీ ఎన్నికలు కిక్ ఇచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. డిసెంబర్ 1 నుంచి 17వ తేదీ వరకు జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలో రూ.43.88కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 43,962 లిక్కర్ బాటిల్స్ అమ్ముడయ్యా యన్నారు.