KRNL: చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామంలో శుక్రవారం 15 ఎకరాల్లో కంది, మిరప పంటల మధ్య గంజాయి సాగు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు, పోలీసులు గుర్తించారు. సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉనేబాద్ శివయ్య భూముల్లో దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆలూరు, చిప్పగిరి ఎస్సైలు, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు పరిశీలనలు కొనసాగిస్తున్నారు.