బాపట్ల జిల్లా పోలీసులకు ప్రతిష్ఠాత్మక రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నుంచి అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అందుకున్నారు. కొందరు పర్యాటక శాఖకు చెందిన వెబ్ సైట్లను పోలిన నకిలీ సైట్లను సృష్టించి ప్రజలను మోసం చేయగా, ఆ కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు గాను ఈ అవార్డు ఇచ్చారు.