WGL: ఖానాపురం మండల కేంద్రంలోని మంగళహారిపేట గ్రామ సర్పంచిగా గొంది సుజాత నాగేశ్వరరావు మూడో విడత ఎన్నికల్లో సర్పంచిగా గెల్పొందారు. గతంలో ఆశ వర్కర్‌గా పనిచేసి సర్పంచ్‌గా గెల్పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో పనిచేసిన సేవలు గుర్తించుకుని గ్రామ ప్రజలు సర్పంచిగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కృషి చేస్తానని పేర్కొన్నారు.