NDL: దోమలను అరికట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఆళ్లగడ్డ మలేరియా సబ్ యూనిట్ అధికారి శివచంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలోని కర్ణమయ్య వీధిలో శనివారం ఉదయం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికున్ గున్యా వంటి వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.