ADB: రాజకీయాల్లో గెలుపు, ఓటమి సహజమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని బుగ్గరం, ఇస్పూర్, బుద్ధికొండ గ్రామపంచాయతీల్లో పోటీ చేసి ఓడిన సర్పంచ్ అభ్యర్థులు గజేందర్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గెలిచినా, ఓడినా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కోరారు.