NLG: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాలకవర్గాలకు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏడాదిన్నర కిందటే వాటి పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 110 పీఏసీఎస్‌లు ఉండగా సూర్యాపేట జిల్లాలో 47, నల్గొండలో 42, యాదాద్రిలో 21 ఉన్నాయి.