GNTR: రాజధానిలో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఆర్డీఏ అదనపు కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ శుక్రవారం మలేషియా బృందంతో సమావేశమయ్యారు. రాయపూడిలోని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాజధాని నిర్మాణ పురోగతిని, ప్రభుత్వం అనుసరిస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలను వివరించారు. 2026 జనవరి ప్రథమార్థంలో అమరావతిలో భారీ పెట్టుబడుల సదస్సు నిర్వహణపై చర్చలు సాగాయి.