JN: నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పాలకుర్తిలో తన క్యాంపు కార్యాలయంలో తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల కాంగ్రెస్ సర్పంచ్లను ఆమె సన్మానించారు. కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.